Donald Trump Returns to X: ఎక్స్‌లోకి అడుగు మళ్లీ అడుగుపెట్టిన డోనాల్డ్ ట్రంప్, మగ్ షాట్ పేరుతో కామెంట్, ఎన్నికల జోక్యం.. లొంగేది లేదంటూ క్యాప్షన్

Former Us President Donald Trump (PIC@ ANI twitter)

2024 అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థిగా ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఎట్టకేలకు తిరిగి ట్విట్టర్ (ఎక్స్) లోకి అడుగు పెట్టారు. ఎక్స్ ప్లాట్ ఫామ్ పై తన మగ్ షాట్ (తమ రికార్డుల కోసం పోలీసులు తీసిన ఫొటో)ను కూడా పోస్ట్ చేస్తూ.. 'మగ్ షాట్ ఆగస్ట్ 24, 2023' పేరుతో ట్రంప్ కామెంట్ కూడా పెట్టారు. ‘ఎన్నికల జోక్యం.. లొంగేది లేదు’ అనే క్యాప్షన్ పెట్టారు. డోనాల్డ్ ట్రంప్ డాట్ కామ్ పేరుతో తన వెబ్ సైట్ చిరునామాను కూడా అక్కడ ప్రదర్శించారు. జార్జియా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ట్రంప్ ఈ పోస్ట్ పెట్టారు. 2021 జనవరి తర్వాత ట్రంప్ చేసిన తొలి ట్వీట్ ఇది. దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ, నెక్ట్స్ లెవల్ అంటూ రిప్లయ్ ఇచ్చారు.

Here's Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement