Drunk Man Sets Mexico Bar On Fire: వీడియో ఇదిగో, బయటకు వెళ్లగొట్టారని బార్‌ను తగలబెట్టిన మందుబాబు, 11 మంది మంటల్లో సజీవ దహనం

మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని బయటకు వెళ్లగొట్టడంతో ఆగ్రహించిన ఓ మందుబాబు ఆ బారుకు నిప్పు అంటించాడు. దీంతో అందులో ఉన్న 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికోలోని సాన్‌ లూయిస్‌ రియో కొలరాడోలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

Fire accident (Credits: Twitter)

మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని బయటకు వెళ్లగొట్టడంతో ఆగ్రహించిన ఓ మందుబాబు ఆ బారుకు నిప్పు అంటించాడు. దీంతో అందులో ఉన్న 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికోలోని సాన్‌ లూయిస్‌ రియో కొలరాడోలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడ్ని విచారిస్తున్నామని సోనోరా అటార్నీ జనరల్‌ తెలిపారు.

బార్‌లో తప్పతాగి అక్కడున్న మహిళల పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించటంతో, అతడ్ని బార్‌ నుంచి వెళ్లగొట్టారు. దీంతో అతడు ఆ బార్‌కు నిప్పుపెట్టాడు.మృతుల్లో ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉండగా, మరో ఆరుగురు కాలిన గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన యొక్క వీడియోలో అగ్నిమాపక సిబ్బంది భారీ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చూడవచ్చు. ప్రజలు అరుస్తూ ప్రాణాల కోసం పరిగెత్తడం వీడియోలో కనిపించింది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement