Earthquake in Afghanistan: వణికిస్తున్న భూకంపాలు, అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం, రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదు

పొరుగుదేశం అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) రెండు రోజులకే మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 5.49 గంటలకు కాబూల్‌లో (Kabul) భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలలజీ (NCS) తెలిపింది. భూకంప కేంద్రం కాబూల్‌కు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది.

భూ అంతర్భంగాలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. దీనివల్ల జరిగిన నష్టానికి సంబందించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.ఈ నెల 27న తఖర్‌ ప్రావిన్స్‌లో, ఈ నెల 22న (గత బుధవారం) హిందూకుష్‌ పర్వతశ్రేణుల్లో వరుస భూకంపాలు సంభవించిన సంగతి విదితమే. ఈ ఘటనలో 12 మంది మరణించారు. 250 మందికిపైగా గాయపడ్డారు.

Here's Update

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement