Earthquake in California: అమెరికాలో తీవ్ర భూకంపం, అంధకారంలోకి వెళ్లిపోయిన దాదాపు 71వేల మంది ప్రజలు, ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు
అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతగా నమోదైంది. భూప్రకంపనల ధాటికి పలుచోట్ల ప్రమాదాలు సంభవించి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతగా నమోదైంది. భూప్రకంపనల ధాటికి పలుచోట్ల ప్రమాదాలు సంభవించి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. ఫార్చునాకు 15 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా హంబోల్డ్ కౌంటీలో వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దాదాపు 71వేల మంది అంధకారంలోకి వెళ్లారు. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోయాయి.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)