Earthquake in Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.7గా నమోదు

ఇండోనేషియాలోని (Indonesia) మంగళవారం తెల్లవారుజామున 2.18 గంటలకు తలాడ్‌ దీవుల్లో (Talaud Islands) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించింది

Earthquake (Photo Credits: X/@Top_Disaster)

ఇండోనేషియాలోని (Indonesia) మంగళవారం తెల్లవారుజామున 2.18 గంటలకు తలాడ్‌ దీవుల్లో (Talaud Islands) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించింది. ఫిలిప్పీన్స్‌ (Philippines) తీరంలోని పసిఫిక్‌ మహాసముద్రంలో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement