Japan earthquake: జపాన్‌లో వరుస భూకంపాలు, భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎంబసీ హెచ్చరిక, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ ఇవిగో..
జపాన్ పశ్చిమ భాగాన్ని నేడు తీవ్ర భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. వరుసగా 21 భూకంపాలతో వణికిపోయింది. దీనికి తోడు స్వల్పశ్రేణి సునామీ అలలు తీరాన్ని తాకాయి.నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది
Japan earthquake LIVE Updates: జపాన్ పశ్చిమ భాగాన్ని నేడు తీవ్ర భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. వరుసగా 21 భూకంపాలతో వణికిపోయింది. దీనికి తోడు స్వల్పశ్రేణి సునామీ అలలు తీరాన్ని తాకాయి.నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6 నమోదయింది. సోమవారం ఉత్తర మధ్య జపాన్‌లో సంభవించినట్టుగా అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
జపాన్‌లో వరుస భూకంపాలు, సునామీ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత పౌరుల సౌకర్యార్థం జపాన్‌లోని ఇండియన్ ఎంబసీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్‌ను ప్రకటించింది. అవసరమైన ఇండియన్ సిటిజన్స్ ఆయా నంబర్స్‌కు కాల్ చేసి తమకు కావాల్సిన వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది. జపాన్ లో ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూమ్ ను 818039301715, 817014920049, 818032144734, 818062295382, 818032144722 నెంబర్లలో సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)