Earthquake in Japan: జపాన్‌లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం, సముద్ర అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ సంస్థ

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. ఈ నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికల్ని జారీ చేసింది. సముద్ర అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడే అవకాశం ఉందని వెల్లడించింది.

Earthquake (Photo Credits: X/@Top_Disaster)

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. ఈ నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికల్ని జారీ చేసింది. సముద్ర అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. కాగా సునామీ అలలతో నోటో, ఇషికావా జపాన్‌లో నదిలో అలలు ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్నాయి.

తాజా భూకంప దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. భూప్రకంపనలతో స్టోర్‌లోని వస్తువులు చెల్లాచెదురవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూకంపానికి సంబందించి ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి నివేదికలు విడుదల చేయలేదు.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now