Earthquake in Japan: భారీ భూంకంపం ధాటికి వణికిన జపాన్, తొమ్మిది మందికి తీవ్ర గాయాలు, షికోకో దీవికి పశ్చిమ దిక్కున 6.6 తీవ్రతతో ప్రకంపనలు
జపాన్(Japan)లో బలమైన భూకంపం సంభవించింది . సౌత్‌వెస్ట్ ప్రాంతంలో వచ్చిన ప్రకంపనల వల్ల సుమారు 9 మంది స్వల్పంగా గాయపడ్డారు. దాని ధాటికి నీటి పైపులు డ్యామేజ్ అయ్యాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని అధికారులు చెప్పారు.
జపాన్(Japan)లో బలమైన భూకంపం సంభవించింది . సౌత్‌వెస్ట్ ప్రాంతంలో వచ్చిన ప్రకంపనల వల్ల సుమారు 9 మంది స్వల్పంగా గాయపడ్డారు. దాని ధాటికి నీటి పైపులు డ్యామేజ్ అయ్యాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని అధికారులు చెప్పారు. షికోకో దీవికి పశ్చిమ దిక్కున 6.6 తీవ్రతతో భూకంపం నమోదు అయ్యింది. షికోకు, క్యుషు దీవుల మధ్య భూకంప కేంద్రం ఉన్నట్లు భావిస్తున్నారు.
సముద్ర ఉపరితలానికి 50 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదు అయ్యింది. షికోకు రైల్వే సర్వీసలను కొన్ని ప్రాంతాల్లో రద్దు చేశారు. ఇకాటా న్యూక్లియర్ కాంప్లెక్స్ వద్ద విద్యుత్త సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సుకుమో ప్రాంతంలో సుమారు 23 మందిని పాక్షికంగా తరలించారు. ఇవాళ భూకంపం వచ్చిన ప్రాంతంలో రానున్న 30 ఏళ్లలో రిక్టర్ స్కేల్‌పై 8 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)