Earthquake in New Zealand: న్యూజిలాండ్ దేశాన్ని వణికించిన భూకంపం, రిక్టరు స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు, భయంతో పరుగులు పెట్టిన ప్రజలు
తాజాగా బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. పరాపరౌముకు వాయవ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో 76 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
న్యూజిలాండ్ దేశాన్ని ఓ వైపు వరదలు, మరోవైపు భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. పరాపరౌముకు వాయవ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో 76 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం తర్వాత 15 నిమిషాల్లోనే 31వేల మంది తాము ఉన్న చోట్ల భూమి కంపించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 30 సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు.
అయితే భూకంపం కారణంగా ఏమైనా ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవించిందా అనే విషయాలపై స్పష్టత లేదు. దీనిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెప్పారు.న్యూజిలాండ్‌లో సైక్లోన్ గేబ్రిల్లే తుఫాను కలవరపాటుకు గురిచేస్తోంది.. వివిధ ప్రమాదాల్లో నలుగురు మరణించగా వేలమంది నిరాశ్రయులయ్యారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)