Earthquake in Pakistan: పాకిస్థాన్‌లో భారీ భూకంపం, తొమ్మిది మంది మృతి, వంద మందికి పైగా గాయాలు, హిందూకుష్ పర్వతాల్లో భూప్రకంపనలు
పాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ లోయ ప్రాంతంలో 6.5 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్థాన్ (Pakistan) సహా ఉత్తర భారతదేశంలో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.భూకంపం ధాటికి ప్రాణ నష్టంతోపాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది.
పాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ లోయ ప్రాంతంలో 6.5 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్థాన్ (Pakistan) సహా ఉత్తర భారతదేశంలో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.భూకంపం ధాటికి ప్రాణ నష్టంతోపాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. భూకంపం వల్ల ఖైబర్ ప్రావిన్స్‌లో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారని పాక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికార ప్రతినిధి బిలాల్ ఫైజీ తెలిపారు. ప్రకృతి విపత్తులో గాయపడినవారు వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.గత రాత్రి ఢిల్లీ-ఎన్‌సిఆర్ & ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కూడా భూకంపం నుండి బలమైన ప్రకంపనలు సంభవించాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)