Earthquake in Tajikistan: తజికిస్థాన్‌‌లో రెండుసార్లు భూకంపం, రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.8గా నమోదు, భయంతో పరుగులు పెట్టిన ప్రజలు

గురువారం తెల్లవారుజామున 5:37 గంటల సమయంలో అక్కడ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.8గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

టర్కీని వణికించిన భూకంపం ఈ సారి తజికిస్థాన్‌‌ను భారీ భూకంపం కుదిపేసింది. గురువారం తెల్లవారుజామున 5:37 గంటల సమయంలో అక్కడ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.8గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది.గోర్నో-బదక్షన్ (Gorno-Badakhshan ) ప్రాంతంలో భూమికి 20.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్‌జీఎస్‌ (USGS) పేర్కొంది.

ఆ తర్వాత 20 నిమిషాలకు 5.0 తీవ్రతతో అదే ప్రాంతంలో మరో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపిచడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగుతు తీశారు. అయితే ఈ భూ ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.