Earthquake in Turkey and Syria: భూకంపానికి విలవిలలాడుతున్న టర్కీ, సిరియా, 4300కు పైగా పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
టర్కీ భూకంపంలో మృతుల సంఖ్య 4372కు పెరిగింది. టర్కీ, సిరియా దేశాల్లో సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 4372కు పైగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. కేవలం తుర్కియేలోనే 2921 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ డిజాస్టర్ సంస్థ తెలిపింది.
టర్కీ భూకంపంలో మృతుల సంఖ్య 4372కు పెరిగింది. టర్కీ, సిరియా దేశాల్లో సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 4372కు పైగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. కేవలం తుర్కియేలోనే 2921 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ డిజాస్టర్ సంస్థ తెలిపింది. ఇక ఆ దేశంలో గాయపడ్డవారి సంఖ్య 15,834గా ఉన్నట్లు పేర్కొన్నది. సిరియాలో భూకంపం వల్ల సుమారు 1451 మంది మరణించారు. మరో 3531 మంది గాయపడ్డారు.ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. టర్కీలో సుమారు 185 సార్లు భూ ప్రకంపనలు నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు.ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)