Turkey Earthquake: టర్కీ, సిరియా భూకంప బాధితులకు అండగా భారత్, అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్నేహ హస్తం అందించిన ప్రధాని మోదీ

ఈ మధ్యాహ్నం మరోసారి టర్కీలో భారీ భూకంపం సంభవించింది. టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం కారణంగా భారీ విధ్వంసం చోటుచేసుకోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

PM Narendra Modi (Photo Credits: ANI)

టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ మధ్యాహ్నం మరోసారి టర్కీలో భారీ భూకంపం సంభవించింది. టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం కారణంగా భారీ విధ్వంసం చోటుచేసుకోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భూకంప బాధిత దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్నేహ హస్తం చాచారు. ప్రధాని మోదీ ప్రకటన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించింది. వైద్యబృందాలు, ఔషధాలను కూడా పంపించింది.

Here's Update