Earthquake: టర్కీపై పగబట్టిన ప్రకృతి, రిక్టరు స్కేలుపై 6.4 తీవ్రతతో మరోసారి విరుచుకుపడిన భూకంపం, ముగ్గురు మృతి, సిరియాను తాకిన భూకంప ప్రకంపనలు

గత విషాద గాయాలు మానిపోకముందే టర్కీ, సిరియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. హతాయ్ ప్రావిన్స్‌ డిఫ్నీ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ముడు అపార్ట్‌మెంట్లు కూలిపోగా.. ముగ్గురు మృతి చెందారు.

arthquake in Turkey, Syria. (Photo Credits: Twitter | ANI)

గత విషాద గాయాలు మానిపోకముందే టర్కీ, సిరియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. హతాయ్ ప్రావిన్స్‌ డిఫ్నీ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ముడు అపార్ట్‌మెంట్లు కూలిపోగా.. ముగ్గురు మృతి చెందారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భూకంపం సంభవించింది సరిహద్దు ప్రాంతం కావడంతో సిరియాలోనూ భూప్రకంపనలు వచ్చాయి. ఆ దేశంలో ఆరుమంది గాయపడ్డారు.రెండు వారాల క్రితమే టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించగా వేల భవనాలు కుప్పకూలి 47,000 మంది శిథిలాల కింద శవాలుగా మారిపోయారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement