Earthquake in Afghanistan: అఫ్గానిస్థాన్‌లో అర్థరాత్రి మళ్లీ భూకంపం, ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేశ రాజధాని కాబూల్ (Kabul) పట్టణానికి పశ్చిమాన 4.1 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున 12.03 గంటలకు భూకంపం వచ్చిందని, భూకంప కేంద్రం కాబూల్‌కు పశ్చిమాన ఉందని వెల్లడించింది.
అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేశ రాజధాని కాబూల్ (Kabul) పట్టణానికి పశ్చిమాన 4.1 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున 12.03 గంటలకు భూకంపం వచ్చిందని, భూకంప కేంద్రం కాబూల్‌కు పశ్చిమాన ఉందని వెల్లడించింది.
భూ అంతర్భాగంలో 73 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. కాగా గత నెల 26న కూడా అఫ్గానిస్థాన్‌లో భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 1.09 గంటలకు 4.3 తీవ్రతతో భూమి కంపించింది. అంతకుముదు హెరాత్ ప్రావిన్స్‌లో (Herat) వచ్చిన భూకంపం వల్ల 4 వేల మందికిపైగా మరణించారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)