Egypt's Pyramids Mystery Solved? : వీడిన ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ.. అసలు ఎలా కట్టారంటే??

ప్రపంచ వింతల్లో ఒకటైన ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ ఎట్టకేలకు వీడినట్టే కనిపిస్తున్నది. భూమిలో పూడుకుపోయిన 64 కి.మీ. పొడవైన నైలునది పాయ ‘అర్హామత్‌’ను ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధకులు గుర్తించారు.

Egypt Pyramids (Credits: X)

Newdelhi, May 19: ప్రపంచ వింతల్లో ఒకటైన ఈజిప్టు పిరమిడ్ల (Egypt Pyramids) నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ ఎట్టకేలకు వీడినట్టే కనిపిస్తున్నది. పిరమిడ్ల నిర్మాణానికి ఉపయోగించిన వందల టన్నుల బరువున్న భారీ బండరాళ్లను అక్కడికి ఎలా తరలించారన్న విషయం ఎవరికీ అంతుబట్టలేదు. అయితే, భూమిలో పూడుకుపోయిన 64 కి.మీ. పొడవైన నైలునది పాయ ‘అర్హామత్‌’ను ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధకులు తాజాగా గుర్తించారు. వేల ఏండ్ల నుంచి ఎడారి కింద మరుగున పడిన ఈ పాయ 31 పిరమిడ్ల పక్క నుంచి ప్రవహిస్తున్నదని తెలిపారు. పిరమిడ్ల నిర్మాణానికి ఉపయోగించిన వందల టన్నుల బరువున్న భారీ బండరాళ్లను ఈ పాయ ద్వారానే రవాణా చేశారని, ఈ క్రమంలోనే వాటి నిర్మాణం సాధ్యమైనట్టు యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా విల్మింగ్టన్‌ అధ్యయనం తేల్చింది.

తెలంగాణ రాష్ట్రం సంక్షిప్త నామం మార్పు.. ఇప్పటివరకూ ఉన్న టీఎస్ ఇకపై టీజీ.. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో ఈ మార్పులు చేయాల్సిందే.. సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు.. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ మార్పు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now