Iran: కుప్పకూలిన పదంతస్తుల భవనం, ఐదుగురు వ్యక్తులు దుర్మరణం, శిథిలాల కింద చిక్కుకుపోయిన మరో 80 మంది, ఇరాన్‌లోని అబాడాన్ నగరంలో విషాద ఘటన
ఇరాన్‌లోని అబాడాన్ నగరంలో పదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన 80 మంది వరకు చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఇరాన్ స్టేట్ టీవి తెలిపింది.
ఇరాన్‌లోని అబాడాన్ నగరంలో పదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన 80 మంది వరకు చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఇరాన్ స్టేట్ టీవి తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు ఇతర ప్రాంతాల నుంచి అత్యవసర బృందాలను పంపుతున్నట్లు స్టేట్ టీవి పేర్కొంది. రెండు రెస్క్యూ డాగ్‌లు, హెలికాప్టర్, ఏడు రెస్క్యూ వాహనాలను ఇప్పటికే సంఘటనా స్థలంలో మోహరించినట్లు తెలిపింది. అయితే, భవనం కూలడానికి మాత్రం కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించగా.. భవన నిర్మాణ కాంట్రాక్టర్‌ను అరెస్టు చేసినట్లు వివరించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)