Typhoon Yagi: మయన్మార్‌‌ను అతలాకుతలం చేసిన యాగీ తుపాను, వరదల బీభత్సానికి 226 మంది మృతి, మరో 77 మంది గల్లంతు, వీడియో ఇదిగో..

భారీ వరదలతో మయన్మార్‌ (Myanmar) అతలాకుతలమైంది. యాగీ తుపాను (Typhoon Yagi) విరుచుకుపడటంతో దేశాన్ని వరదలు పోటెత్తాయి. దీంతో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో దాదాపు 226 మంది మృతి చెందారు. మరో 77 మంది గల్లంతైనట్లు అధికారిక మీడియా వెల్లడించింది.

Floods and landslides in Myanmar (photo-AFP)

భారీ వరదలతో మయన్మార్‌ (Myanmar) అతలాకుతలమైంది. యాగీ తుపాను (Typhoon Yagi) విరుచుకుపడటంతో దేశాన్ని వరదలు పోటెత్తాయి. దీంతో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో దాదాపు 226 మంది మృతి చెందారు. మరో 77 మంది గల్లంతైనట్లు అధికారిక మీడియా వెల్లడించింది. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దాదాపు 6.30 లక్షలమంది ప్రకృతి విపత్తుతో ప్రభావితమయ్యారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐరాస తెలిపింది.

వియత్నాంను వణికించిన యాగి తుపాను, భారీ వరదలకు 141 మంది మృతి, మరో 59 మంది గల్లంతు, వరద పోటెత్తి పొంగిపొర్లిన డైక్ నది

మయన్మార్‌లో వరదల ధాటికి.. వేల ఎకరాల్లో పంట నాశనమైంది. రాజధాని నేపిడావ్‌ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు ఆహారం, తాగునీరు, సరైన ఆశ్రయం లేక అల్లాడుతున్నట్లు ఐరాస తెలిపింది. రహదారుల వంటి మౌలిక సౌకర్యాలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని పేర్కొంది. వియత్నాం, థాయ్‌లాండ్‌, లావోస్‌లలోనూ యాగీ తుపాను విధ్వంసం సృష్టించింది. ఒక్క వియత్నాంలోనే 300 మందిని బలితీసుకుంది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement