Sherika De Armas Dies: గర్భాశయ కేన్సర్‌తో పోరాడి మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ మృతి
మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్, అడ్వర్టైజింగ్ మోడల్ షెరికా డి అర్మాస్ (26) కన్నుమూశారు. గత కొంతకాలంగా గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్న అక్టోబర్ 13న తుదిశ్వాస విడిచారని సోదరుడు మేక్ డి అర్మాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్, అడ్వర్టైజింగ్ మోడల్ షెరికా డి అర్మాస్ (26) కన్నుమూశారు. గత కొంతకాలంగా గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్న అక్టోబర్ 13న తుదిశ్వాస విడిచారని సోదరుడు మేక్ డి అర్మాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. షెరికా అకాల మరణంపై సొంత దేశం ఉరుగ్వేతోపాటు, ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది.షెరికా 2015లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వేకు ప్రాతినిధ్యం వహించారు. కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలతో దాదాపు రెండేళ్లపాటు ఈ మహమ్మారితో పోరాడి చివరికి తనువు చాలించారు.
2015 చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో షెరికా డి అర్మాస్ టాప్ 30లో స్థానం దక్కించుకోలేకపోయినప్పటకి, ఆరుగురు 18 ఏళ్ల పోటీదారుల్లో ఒకరిగా నిలిచింది.షే డి అర్మాస్ స్టూడియో పేరుతో హెయిర్, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తుల వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టింది. అంతేకాదు కేన్సర్‌తో బాధ పడుతున్న పిల్లల చికిత్స చేసే పెరెజ్ స్క్రీమినీ ఫౌండేషన్ కోసం కొంత సమయాన్ని వెచ్చించినట్టు తెలుస్తోంది