Plane Crash in France: కరెంట్ తీగలు తగిలి నడిరోడ్డు మీద కూలిన విమానం, ముగ్గురు ప్రయాణికులు మృతి, రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్
తక్కువ ఎత్తులో ఎగురుతుండగా ఓ విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పారిస్ లోని డిస్నీల్యాండ్ సమీపంలో ఏ4 మోటార్ వే పై చిన్న ప్యాసింజర్ విమానం కూలిపోయింది. తలకిందులుగా రోడ్డుపై పడడంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోయారు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో చిన్న విమానం ఒకటి నడి రోడ్డుపై కుప్పకూలింది. తక్కువ ఎత్తులో ఎగురుతుండగా ఓ విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పారిస్ లోని డిస్నీల్యాండ్ సమీపంలో ఏ4 మోటార్ వే పై చిన్న ప్యాసింజర్ విమానం కూలిపోయింది. తలకిందులుగా రోడ్డుపై పడడంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోయారు. గాయాలపాలైన మిగతా వారిని రెస్క్యూ సిబ్బంది ఎయిర్ ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఏ4 మోటార్ వే పై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సూడాన్‌లో కుప్పకూలిన విమానం, నలుగురు సైనిక సిబ్బందితో సహా తొమ్మిది మంది మృతి
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)