Fake Recruitment Abroad: ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారికి విదేశాంగ శాఖ హెచ్చరిక.. నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచన
ఫేక్ సంస్థల నకిలీ జాబ్ ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Newdelhi, Dec 29: నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల (Fake Recruitment firms) బారిన పడొద్దంటూ విదేశాంగ శాఖ ఉద్యోగార్థులను తాజాగా హెచ్చరించింది. ఫేక్ సంస్థల (Fake Firms) నకిలీ జాబ్ ఆఫర్ల (Job Offers) విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోని అనేక సంస్థలు విదేశీ ఉద్యోగాల పేరిట ఒక్కొక్కరి నుంచీ రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయని తెలిపింది. వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా కాల్స్, మెసేజీలతో బాధితులను ట్రాప్ చేసే ఏజెన్సీలను పట్టుకోవడం కష్టంగా మారిందని కూడా పేర్కొంది. ఇమిగ్రేషన్ యాక్ట్ -1983 ప్రకారం ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయ్యే సంస్థలు తమ సేవలకు గాను రూ.30 వేల ఫీజును, 18 శాతం జీఎస్టీతో తీసుకుంటాయని వివరించింది. నకిలీ సంస్థలపై కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)