Hyderabad, Dec 29: తెలంగాణ సర్కారు (Telangana Government) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అభయహస్తం’ (Abhayahastam Clarifications) దరఖాస్తులపై ప్రజల్లో పలు సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రేషన్ కార్డులు లేని వాళ్లు కూడా అభయహస్తానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మిగతా వాళ్లు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేసి దరఖాస్తు చేయాలని సూచించింది. ఈ క్రమంలో అనేక మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడంతో పాటూ అభయహస్తం గ్యారెంటీలకూ అప్లై చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, రేషన్ కార్డు లేని కొందరు ఇన్ కమ్ సర్టిఫికేట్ ను, మరికొందరు క్యాస్ట్ సర్టిఫికేట్ ను జత చేస్తుండటం గందరగోళానికి కారణమైంది. ఈ విషయమై అధికారులు క్లారిటీ ఇచ్చారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో ఏ వర్గమో చెబితే సరిపోతుందని అన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కం సర్టిఫికేట్ అవసరం లేదని తెలిపారు.