Gaza Peace Deal: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక ముందడుగు, మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించిన రెండు దేశాలు, నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని ప్రశంసించిన భారత ప్రధాని మోదీ
గత రెండు ఏళ్ల నుంచి సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపుకు కీలక ముందడుగు పడింది. గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas) రెండు దేశాలె మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ శాంతి ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు.
గత రెండు ఏళ్ల నుంచి సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపుకు కీలక ముందడుగు పడింది. గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas) రెండు దేశాలె మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ శాంతి ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ శాంతి ప్రణాళికకు సంబంధించి మొదటి దశ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది.
ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ ఒప్పందం యుద్ధంతో దెబ్బతిన్న గాజా ప్రాంతంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నట్లు పోస్టులో పేర్కొన్నారు. యుద్ధంతో దెబ్బతిన్న గాజా ప్రాంతంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని మేము ఆశిస్తున్నామని ప్రధాని మోదీ తన ఎక్స్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Here's Update