Ayodhya Ram Mandir: వీడియోలు ఇవిగో, జై శ్రీరామ్ అంటూ 250 కార్లతో అమెరికాలో ర్యాలీ, 11 దేవాలయాల మీదుగా సాగిన శోభాయాత్ర
ఈ ర్యాలీ 100 మైళ్ల మేర సాగింది. ఈ ర్యాలీని శ్రీ మీనాక్షి ఆలయం దగ్గర ప్రారంభించి, రిచ్‌మండ్‌లోని శ్రీ శారదాంబ ఆలయం వద్ద ముగించారు
Hindu Americans hold car rally in Houston: అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టపై అమెరికాలో సైతం జై శ్రీరామ్ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. జనవరి 22న అయోధ్యలో జరిగే పవిత్రోత్సవానికి హాజరుకావాలని ఆలయ నిర్వాహకులకు అమెరికాలోని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆహ్వానం పంపింది. ఈ నేపధ్యంలో హ్యూస్టన్‌లో భక్తులు జై శ్రీరామ్ అంటూ కారు ర్యాలీ చేపట్టారు.
హిందూ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు హ్యూస్టన్‌లో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ 250 కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ 100 మైళ్ల మేర సాగింది. ఈ ర్యాలీని శ్రీ మీనాక్షి ఆలయం దగ్గర ప్రారంభించి, రిచ్‌మండ్‌లోని శ్రీ శారదాంబ ఆలయం వద్ద ముగించారు.జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ చేపట్టిన ఈ ర్యాలీ 11 దేవాలయాల మీదుగా సాగింది. సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు సంకీర్తనలతో శోభాయాత్రకు స్వాగతం పలికారు
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)