‘India Has Been Our 911 Call’: ఎప్పుడూ కాల్ చేసినా మాల్దీవులను రక్షించేది భారత్ మాత్రమే, ఇండియాను 911 కాల్‌తో పోల్చిన మాల్దీవుల మాజీ రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీ
ఈ వ్యాఖ్యలు మాల్దీవుల ప్రభుత్వానికే చిన్నచూపు అని ఆమె అన్నారు. రక్షణతో సహా వివిధ రంగాలలో సహాయం చేస్తూ భారతదేశం నమ్మకమైన మిత్రదేశంగా ఉందని చెప్పారు.
మాల్దీవుల మంత్రులు భారత ప్రధానిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు మాల్దీవుల ప్రభుత్వానికే చిన్నచూపు అని ఆమె అన్నారు. రక్షణతో సహా వివిధ రంగాలలో సహాయం చేస్తూ భారతదేశం నమ్మకమైన మిత్రదేశంగా ఉందని చెప్పారు. భారత్‌తో మాల్దీవులకు ఉన్న చిరకాల బంధాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఆమె విమర్శించారు.మాల్దీవుల పట్ల భారతదేశాన్ని "911 కాల్"(అమెరికాలో అత్యవసర సేవల నెంబర్)గా అభివర్ణించారు. ఎప్పుడూ కాల్ చేసినా మాల్దీవులను రక్షించడానికి సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.
మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం నెలకొంది. భారత్ గురించి హేళనగా మాట్లాడటంపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు నినాదాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇరుదేశాలు హైకమిషనర్లకు సమన్లు జారీ చేశాయి.
Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)