Bangladesh Protest: బంగ్లాదేశ్‌లో ఆగని ఆందోళనలు, వీసా సెంటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించిన భారత్, నేడు కొలువుదీరనున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం
ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఆర్మీ రంగంలోకి దిగినప్పటికీ శాంతి భద్రతలు అదుపులోకి రానట్లు తెలిసింది.
బంగ్లాదేశ్‌లో ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమంతో రాజకీయ అస్థిరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఆర్మీ రంగంలోకి దిగినప్పటికీ శాంతి భద్రతలు అదుపులోకి రానట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బంగ్లాలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు (Indian Visa Centres closed) ప్రకటించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా యూనస్..15 మంది సభ్యులతో ప్రభుత్వ ఏర్పాటు, నేడే బాధ్యతల స్వీకరణ, భారత్‌లోకి చొరబడేందుకు ప్రజల ప్రయత్నం
బంగ్లా వ్యాప్తంగా అన్ని వీసా దరఖాస్తు సెంటర్లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి నోటీసులు వచ్చేంత వరకూ అన్ని సెంటర్లూ మూసే ఉంటాయని స్పష్టం చేశారు. తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారమివ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు భారత వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్ పోర్టల్‌లో సందేశం పెట్టారు. నేడు బెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కొలువదీరనుంది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)