India-Canada Tension: భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు, నేటి నుంచి కెనడాకు వీసా సేవలను నిలిపివేసిన భారత్, భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచన
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో కెనడియన్లకు వీసా సేవలను (Visa Services) భారత్ గురువారం నిలిపివేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిర్వహణ పరమైన కారణాలతో సెప్టెంబర్ 21 నుంచి భారతీయ వీసా సేవలు తదుపరి నోటీసులు వెలువడే వరకూ నిలిచిపోయాయని కెనడియన్ల వీసా దరఖాస్తులను పరిశీలించేందుకు నియమించిన ప్రైవేట్ ఏజెన్సీ బీఎల్ఎస్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.కెనడియన్ల వీసా సేవల నిలిపివేతను భారత్ అధికారులు ధ్రువీకరించారు. ఇక భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతినడంతో కెనడాలో భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తమ పౌరులకు భారత్ మార్గదర్శకాలకు జారీ చేసింది.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)