Iran Fire: ఇరాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో సజీవ దహనమైన 32 మంది, మరో 16 మందికి తీవ్ర గాయాలు, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
గురువారం రాత్రి జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఏకంగా 32 మంది మృత్యువాత పడ్డారు. మరో 16 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా శుక్రవారం నివేదించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో బాధితులు అందులో చిక్కుకు పోయారు.
ఇరాన్‌లో మాదక ద్రవ్యాల పునరావాస కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఏకంగా 32 మంది మృత్యువాత పడ్డారు. మరో 16 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా శుక్రవారం నివేదించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో బాధితులు అందులో చిక్కుకు పోయారు.
మంటల ధాటికి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బాధితులు తప్పించుకునే మార్గం లేకుండా పోయినట్టు తెలుస్తోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియ రాలేదు.ఉత్తర గిలాన్ ప్రావిన్స్‌లోని లాంగరుడ్ నగరంలోని డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చెలరేగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మొహమ్మద్ జలాయ్ తెలిపారు. ఈ సెంటర్ నిర్వాహకుడితో పాటు పలువురిని ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)