Iran: యాంకర్ హిజాబ్ వేసుకోకపోవడంతో ఇంటర్యూ క్యాన్సిల్ చేసిన ఇరాన్ అధ్యక్షుడు,ట్విట్టర్లో మండిపడిన సీఎన్ఎన్ ఇంటర్నేషనల్ యాంకర్
ఇరాన్‌లో హిజాబ్ హీట్ కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో CNNచీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్ క్రిస్టియానే అమన్‌పౌర్ ఛానల్ తరపున ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసిని ఇంటర్యూ చేయాల్సి ఉండగా అది క్యాన్సిల్ అయింది. దీనికి ప్రధాన కారణం ఆమె హిజాబ్ ధరించకపోవడమే.
ఇరాన్‌లో హిజాబ్ హీట్ కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో CNNచీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్ క్రిస్టియానే అమన్‌పౌర్ ఛానల్ తరపున ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసిని ఇంటర్యూ చేయాల్సి ఉండగా అది క్యాన్సిల్ అయింది. దీనికి ప్రధాన కారణం ఆమె హిజాబ్ ధరించకపోవడమే. హిజాబ్ ధరించాలన్న షరతుకు ఆమె అంగీకరించకపోవడంతో.. ఇంటర్వ్యూ ఇవ్వకుండానే వెనుదిరిగారు అధ్యక్షుడు రైసి.
గతంలో ఏ ఇరాన్ అధ్యక్షుడు.. విదేశాల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇలాంటి షరతు విధించడం చూడలేదు. కాబట్టి, నేను అంగీకరించను’’ అని ఆమె తేల్చి చెప్పింది.దీంతో ఇంటర్వ్యూ ఇవ్వకుండానే అధ్యక్షుడు రైసి వెళ్లిపోయినట్లు తెలిసింది.దీంతో ఆమె ట్విటర్‌లో తన నిరసన వ్యక్తం చేశారు. తన ఎదురుగా ఖాళీ చెయిర్‌ను చూపిస్తూ.. ఇంటర్వ్యూ తాలుకా సెట్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె అందులో వివరిస్తూ.. అధ్యక్షుడు రైసి తీరును తప్పుబట్టారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)