Israel-Hamas War: వీడియో ఇదిగో, హమాస్‌ మిలిటెంట్లను ఏరిపారేస్తున్న ఇజ్రాయెల్‌ పోలీసులు, బైక్‌పై వెంటాడి మరీ ఇద్దర్ని హతమార్చిన కాప్స్

తమ దేశంపై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) చేపట్టిన దాడులకు ఇజ్రాయెల్‌ (Israel) తగిన జవాబు చెబుతోంది. హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ పోలీసులు ఏరిపారేస్తున్నారు. సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులను వెంబడించి మరీ షూట్‌ చేసి పారేస్తున్నారు.

Israel-Hamas War (Photo-X/video Grab)

తమ దేశంపై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) చేపట్టిన దాడులకు ఇజ్రాయెల్‌ (Israel) తగిన జవాబు చెబుతోంది. హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ పోలీసులు ఏరిపారేస్తున్నారు. సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులను వెంబడించి మరీ షూట్‌ చేసి పారేస్తున్నారు. తాజాగా గాజా సరిహద్దు (Gaza Border)లో ఇద్దరు హమాస్‌ మిలిటెంట్లను గుర్తించిన ఇజ్రాయెల్‌ పోలీసులు (Israel Cops) వారిని వెంబడించి మట్టుపెట్టారు.ఓ కారులో పారిపోతున్న మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ఛేజ్ చేశారు.

ఓ కారులో ఇద్దరు పోలీసులతో పాటు బైక్‌పై మరో ఆఫీసర్ వారిని వెంబడించారు. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న పోలీసు అధికారి గన్‌ చేతపట్టి మిలిటెంట్లపై కాల్పులు జరిపాడు. అనంతరం కారులో వెళ్తున్న మరో ఇద్దరు పోలీసులు కూడా పలు రౌండ్లు కాల్పులు జరపడంతో మిలిటెంట్లు చనిపోయారు. ఇదంతా బైక్ నడుపుతున్న పోలీస్ ఆఫీసర్ యూనిఫాంకు అమర్చిన వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియోను ఇజ్రాయెల్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

Israel-Hamas War

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement