Covid Vaccination in Italy: టీకా తీసుకున్న తరువాత రక్తం గడ్డకట్టి మరణించిన టీనేజర్, 60 ఏళ్ల లోపు వయసున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వబోమని తెలిపిన ఇటలీ, వారికి రెండవ డోసుకు వేరే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం

ఇటీవల మే 25 న ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న ఓ టీనేజర్‌ కెమిల్లా కనేపా (18) రక్తం గడ్డకట్టి మరణించాడు. దీంతో 60 ఏళ్ల లోపు వయసున్న వారికి ఆక్సఫర్డ్-ఆస్ట్రాజెనెకా తయారుచేసిన వ్యాక్సిన్‌ ఇవ్వబోమని ఇటలీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

AstraZeneca vaccine

ఇటీవల మే 25 న ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న ఓ టీనేజర్‌ కెమిల్లా కనేపా (18) రక్తం గడ్డకట్టి మరణించాడు. దీంతో 60 ఏళ్ల లోపు వయసున్న వారికి ఆక్సఫర్డ్-ఆస్ట్రాజెనెకా తయారుచేసిన వ్యాక్సిన్‌ ఇవ్వబోమని ఇటలీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇకపై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ పంపిణీని కూడా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇక మీదట ఆస్ట్రాజెనెకా టీకా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఇవ్వనున్నట్లు ఆ దేశ ప్రత్యేక కోవిడ్ -19 కమిషనర్ ఫ్రాన్సిస్కో ఫిగ్లియులో విలేకరులతో అన్నారు.

ఆస్ట్రాజెనెకా మొదటి డోసు పొందిన 60 ఏళ్లలోపు వారికి రెండవ డోసుకు వేరే వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వ ముఖ్య వైద్య సలహాదారు అదే విలేకరుల సమావేశంలో అన్నారు. అనేక యూరోపియన్ దేశాల మాదిరిగానే, ఇటలీ కూడా ఈ టీకా కారణంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని 60 ఏళ్ల లోపు వయసున్న వారికి ఈ టీకా నిలిపివేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now