Japan Earthquake Update: జపాన్‌లో భారీ భూకంపం, 20 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా కట్, రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదు, ఇద్దరు మృతి
జపాన్‌లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైనట్లు ఆ దేశ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఉత్తర జపాన్‌లోని ఫుకుషిమా తీర ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైందని తెలుస్తోంది. భూకంపం నేపథ్యంలో జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి
జపాన్‌లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైనట్లు ఆ దేశ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఉత్తర జపాన్‌లోని ఫుకుషిమా తీర ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైందని తెలుస్తోంది. భూకంపం నేపథ్యంలో జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈశాన్య తీరంలో అలలు మీటర్ ఎత్తు వరకు ఎగసిపడవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు భూకంపం ధాటికి సుమారు 20 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ పేర్కొంది.ఈ విపత్తులో ఇద్దరు మరణించగా 126 మంది గాయపడ్డారు. కాగా, 2011లో కూడా ఉత్తర జపాన్‌లో 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు ఉద్భవించిన సునామీ అణు విపత్తుకు కారణమైంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement