Plane Catches Fire: ఘోర ప్రమాదం వీడియో ఇదిగో, ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా మరో విమానాన్ని ఢీకొట్టిన విమానం, ఒక్కసారిగా చెలరేగిన మంటలు

జపాన్‌ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని టోక్యోలోని ఎయిర్‌పోర్టు రన్‌వేపైని విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. హోకియాడో నుంచి వస్తున్న జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన JAL 516 విమానం హనెడా ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతుండగా మంటలు అంటుకున్నాయి.

Japan Plane Explosion (Photo Credit: X/ @tshinfuku1115)

జపాన్‌ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని టోక్యోలోని ఎయిర్‌పోర్టు రన్‌వేపైని విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. హోకియాడో నుంచి వస్తున్న జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన JAL 516 విమానం హనెడా ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతుండగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ అధికారులు స్పందిస్తూ.. విమానం రన్‌వేపై దిగిన తర్వాత అక్కడే ఉన్న కోస్టు గార్డు ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీకొన్నట్లు భావిస్తున్నామని జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కేకు తెలియజేశారు.

దీంతో విమానంలోని 379 ప్రయాణికులు, సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు.అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో విమానం రన్‌వేపై దిగుతుండగానే దాని చక్రాల నుంచి మంటలు వెలువడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాదాపు 70కి పైగా అగ్నిమాపక శకటాలను మంటలను అదుపు చేస్తున్నాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement