Man Finds Live Frog in Udon: నూడుల్స్ మొత్తం తినేశాడు, చివర్లో కప్పులో నుంచి బతికున్న కప్ప బయటకు రావడంతో షాక్, వీడియో ఇదిగో..
జపాన్ దేశంలో ఒక పేరు మోసిన రెస్టారెంట్‌లో ఒకాయన udon noodles ఆర్డర్ చేస్తే పాపం అతడికి అందులో కప్ప ప్రతక్షమైంది. పైగా ఆ కప్ప బతికుండటంతో ఆ పెద్దమనిషి తిన్నది కక్కలేక, మిగిలింది మింగలేక దయనీయ స్థితిలో ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
జపాన్ దేశంలో ఒక పేరు మోసిన రెస్టారెంట్‌లో ఒకాయన udon noodles ఆర్డర్ చేస్తే పాపం అతడికి అందులో కప్ప ప్రతక్షమైంది. పైగా ఆ కప్ప బతికుండటంతో ఆ పెద్దమనిషి తిన్నది కక్కలేక, మిగిలింది మింగలేక దయనీయ స్థితిలో ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. జపాన్‌కు చెందిన కైటో అనే ఓ వ్యాపారస్తుడుకి ఈ వింత అనుభవం ఎదురైంది.
udon noodles దాదాపు మొత్తం తినేయటంతో చేసేదేమీ లేక రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీశాడు. పరువు పోతుందన్న భయంతో సదరు రెస్టారెంట్ యాజమాన్యం కైటోకు క్షమాపణ చెప్పి నష్టపరిహారాన్ని చెల్లించింది. ఆ రెస్టారెంట్ వారు క్షమాపణలు చెప్పినా కూడా కైటో తనకు ఎదురైన పరిస్థితి మరెవరికీ ఎదురు కాకూడదనే ఉద్దేశ్యంతో తన పరిస్థితి మొత్తాన్నీ వీడియోతో సహా జపానీస్ భాషలో తన ట్విట్టర్ అకౌంట్లో పొందుపరిచాడు.
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)