Kenya Dam Bursts: కెన్యాలో భారీ వరదలకు డ్యామ్ కూలి 40 మంది మృతి, గ్రామాల్లోకి పోటెత్తిన నీటిలో కొట్టుకుపోయిన 42 మంది గ్రామవాసులు
ఈ మేరకు స్థానిక అధికారులు తాజాగా వెల్లడించారు.కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి విదితమే. పశ్చిమ కెన్యాలోని రిఫ్ట్ వ్యాలీ (Rift Valley)లో గల కిజాబె డ్యామ్ నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది
ఆఫ్రికా దేశమైన కెన్యా (Kenya)లో ఓ డ్యామ్ కూలి (dam bursts) సుమారు 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు స్థానిక అధికారులు తాజాగా వెల్లడించారు.కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి విదితమే. పశ్చిమ కెన్యాలోని రిఫ్ట్ వ్యాలీ (Rift Valley)లో గల కిజాబె డ్యామ్ నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఆ నీరంతా దిగువ గ్రామాల్లోకి పోటెత్తడంతో సుమారు 42 మంది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మరణించినట్లు నకురు కౌంటీ గవర్నర్ సుసాన్ కిహికా తెలిపారు.
నీటి ఉద్ధృతికి పలు ఇళ్లు, రోడ్లు కూడా కొట్టుకుపోయాయని, బుదరలో మరికొంత మంది చిక్కుకుపోయినట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక భారీ వర్షాలకు గత నెలలో సుమారు 100 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)