CM Revanth Reddy Pree Meet (Photo/X/Congress)

రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మిడ్‌ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ఈ మేరకు  4,696 ఇళ్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 గ్రామాలకు చెందిన నాలుగు వేలకు పైగా కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే 2006 సంవత్సరంలో మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించగా, ఈ ప్రాజెక్టు పనులు 2019లో పూర్తయ్యాయి డ్యాం నిర్మాణం వల్ల మొత్తం దాదాపు 12 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో దాదాపు 12 వేల కుటుంబాల వరకు నిర్వాసితులు అయినట్టు తెలుస్తోంది. కాగా వీరిలో 11,731 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించింది.

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కాలనీలు నిర్మించి ఒక కుటుంబానికి 240 గజాలు చొప్పున ఇంటి స్థలం కేటాయించారు. అయితే తమకు కేటాయించిన స్థలాల్లో నిర్వాసితులు తమ సొంత డబ్బులతోనే చాలా వరకు ఇలానే నిర్మించుకున్నారు. 2015 సంవత్సరంలో ఎవరైతే ఇల్లను నిర్మించుకున్నారో వారికి ఐదు లక్షల చొప్పున ఇస్తామని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ హామీ నెరవేరలేదు అని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించి వారిలో 4,696 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ వల్ల మిడ్ మానేరు నిర్వాసితులు, హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ చిరకాల కోరిక నెరవేరిందని ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు.