Karnataka, AUG 17: తుంగభద్ర డ్యామ్(Tungabhadra Dam)లో గల్లంతైన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ (Stop log ) ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. పనులు చేపట్టిన 24 గంటలలోపే 5 బ్లాక్‌ల్లో స్టాప్ లాగ్ ఎలిమెంట్లను అధికారులు విజయవంతంగా అమర్చారు. 4 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో స్టాప్ లాగ్ ఎలిమెంట్లను అమర్చి వృథాగా పోతున్న నీటిని పూర్తిగా అడ్డుకున్నారు. తుంగభద్ర బోర్డు (Tungabadra Board), కర్ణాటక(Karnataka), ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) అధికారులు ఉమ్మడి కృషి ఫలితంగా డ్యామ్‌లోని నీటిని వృథాగా వెళ్లకుండా అడ్డుకున్నారు. డ్యాంల గేట్లు తయారీలో నైపుణ్యం ఉన్న సాగునీటి నిపుణులు కన్నయ్య నాయుడు ఈ బృందానికి నాయకత్వం వహించారు.
తుంగభద్ర నుంచి గత నాలుగు రోజులుగా 45 టీఎంసీల నీరు కిందకు వృథాగా వెళ్లింది. మరింత నీరు దిగువకు పోకుండా యుద్ధప్రాతిపదికన రెండు ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకోవడంలో సఫలమయ్యారు. స్టాప్‌లాగ్ నిర్మాణ ఖర్చుల కోసం రూ. 5 కోట్ల నిధుల వినియోగానికి తుంగభద్ర పాలకమండలి అనుమతి ఇచ్చిందని అధికారులు తెలిపారు.