'Hamas-like attack' on India: వీడియో ఇదిగో, భారత్‌పై ‘హమాస్’ తరహా దాడి చేస్తామంటూ ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నున్ బెదిరింపు, హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడి
‘పంజాబ్‌పై భారత్ ఆక్రమణకు పాల్పడితే, తగిన విధంగా స్పందిస్తాం. హమాస్ తరహా దాడికి పాల్పడతాం’ అంటూ ఆన్‌లైన్‌లో ఓ వీడియోను విడుదల చేశాడు
భారత్‌పై ‘హమాస్’ తరహా దాడి చేపడతామంటూ ఖలిస్థాన్ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నున్ బెదిరింపులకు దిగాడు. ‘పంజాబ్‌పై భారత్ ఆక్రమణకు పాల్పడితే, తగిన విధంగా స్పందిస్తాం. హమాస్ తరహా దాడికి పాల్పడతాం’ అంటూ ఆన్‌లైన్‌లో ఓ వీడియోను విడుదల చేశాడు. ‘పాలస్తీనా-ఇజ్రాయెల్ సంక్షోభం నుంచి ప్రధాని మోదీ నేర్చుకోవాలి. పాలస్తీనా స్పందించినట్టుగా పంజాబ్ ప్రజలు కూడా రియాక్ట్ అవుతారు. హింసకు సమాధానం ప్రతి హింస అవుతుంది’ అని ముందస్తుగా రికార్డ్ చేసిన ఓ వీడియోలో భారత్‌కు హెచ్చరిక జారీచేశాడు. కెనడాలో హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకు ఎస్‌ఎఫ్‌జే ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)