Los Angeles Wildfire: వీడియోలు ఇవిగో, మంటల్లో కాలిబూడిదపోతున్న హాలీవుడ్ నటులు భవనాలు, అగ్నికి మాడిమసైపోతున్న లాస్ ఏంజిల్స్
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు(Los Angeles Wildfires) తీవ్ర రూపం దాల్చింది. గంటల వ్యవధిలోనే వేల వేల హెక్టార్లకు మంటలు వ్యాపించాయి. దీంతో లాస్ ఏంజిల్స్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 10 ఎకరాల నుంచి మూడు వేల ఎకరాల వరకు మంటలు వ్యాపించినట్లు అధికారులు చెప్పారు
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు(Los Angeles Wildfires) తీవ్ర రూపం దాల్చింది. గంటల వ్యవధిలోనే వేల వేల హెక్టార్లకు మంటలు వ్యాపించాయి. దీంతో లాస్ ఏంజిల్స్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 10 ఎకరాల నుంచి మూడు వేల ఎకరాల వరకు మంటలు వ్యాపించినట్లు అధికారులు చెప్పారు. దాదాపు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించినట్లు అగ్నిమాపక సిబ్బంది చీఫ్ క్రిస్టిన్ క్రౌలే తెలిపారు. సుమారు 13 వేల బిల్డింగ్‌లకు ప్రమాదం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. హాలీవుడ్ నటులు ఉండే ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.
దాదాపు 3000 ఎకరాలు దగ్ధమయ్యాయి. దీంతో 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలామంది తమ సామగ్రి, వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి తరలివెళ్లారు. దాదాపు 62,000 మంది ప్రజలు కొన్ని గంటలుగా విద్యుత్తు లేక ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడ మంటలను ఆర్పడానికి విమానాలు, హెలికాప్టర్లు, బుల్డోజర్లను అధికారులు రప్పించారు. కాగా అమెరికాలో సంపన్నులకు ఆవాసాలైన మూడు నగరాల్లో లాస్ ఏంజెలెస్ ఒకటి. ఇప్పుడు ఆ సిటీలోని అత్యంత ఖరీదైన ప్రదేశం ది పాలిసాడ్స్‌ని (Pacific Palisades) కార్చిచ్చు చుట్టుముట్టింది.
Los Angeles Wildfire Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)