Mexico Mass Shooting: మెక్సికో నైట్ క్లబ్‌లో మారణహోమం, ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపిన దుండగులు, ఎనిమిది మంది మృతి, ఐదుగురికి గాయాలు

దీంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీగా ఆయుధాలు ఉన్న వ్యక్తులు రెండు వాహనాల్లో ఎల్‌వానాడిటో అనే నైట్‌క్లబ్‌కు వచ్చారని, అనంతరం విచక్షనారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.

Representational image. (Photo Credit: GoodFreePhotos)

ఉత్తర మెక్సికోలోని జెరెజ్‌ పట్టణంలో ఉన్న ఓ నైట్‌క్లబ్‌లో సాయుధుడైన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీగా ఆయుధాలు ఉన్న వ్యక్తులు రెండు వాహనాల్లో ఎల్‌వానాడిటో అనే నైట్‌క్లబ్‌కు వచ్చారని, అనంతరం విచక్షనారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దుండగుల కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారని వెల్లడించారు. బాధితుల్లో క్లబ్‌ ఉద్యోగులు, మ్యుజీషియన్స్‌, వినియోగదారులు ఉన్నారని చెప్పారు. గతేడాది జెరెజ్‌లో భారీ హింసాకాండ చోటు చేసుకుంది. దీంతో సమీపంలోని గ్రామీణ కమ్యూనిటీల్లోని వందలాది మంది తమ ఇండ్లను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు.

Here's NDtv Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)