Mia Khalifa: పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన పోర్న్ స్టార్ మియా ఖలీపా, ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు, సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు

Mia Khalifa (Photo-X)

Mia Khalifa Fired Over Palestine Support: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా నిలిచినందుకు అమెరికన్ మోడల్, మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫాను ఉద్యోగం నుండి తొలగించారు. ఖలీఫా తన సోషల్ మీడియా ఖాతాలలో పాలస్తీనాకు మద్దతుగా అనేక పోస్ట్‌లు చేశారు. దీంతో కెనడియన్ రేడియో హోస్ట్ పోడ్‌కాస్టర్ అయిన టాడ్ షాపిరోతో పోడ్‌కాస్ట్ ఒప్పందం నుండి మియా ఖలీఫా తొలగించబడింది. ఖలీఫాను ఉద్యోగం నుంచి తొలగించడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెకు మద్దతు తెలుపగా, మరికొందరు విమర్శలు చేశారు.

కాగా తన వివాదాస్పద పోస్ట్‌లో, ఖలీఫా ఇలా పేర్కొంది, "పరిస్థితిని చూసేటప్పుడు మీరు పాలస్తీనియన్ల పక్షం వహించలేకపోతే, మీరు వర్ణవివక్ష యొక్క తప్పు వైపున ఉన్నారని మరియు చరిత్ర దీనిని కాలక్రమేణా రుజువు చేస్తుందన్నారు.

Mia Khalifa (Photo-X)

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now