Migrant Boat Missing: 200 మందితో స్పెయిన్ వెళ్తున్న బోటు మిస్సింగ్, కానరీ దీవుల్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన స్పానిష్ దళాలు
సెనెగల్ నుండి వలస వచ్చిన బోటు 200 మందితో కానరీ దీవుల నుండి తప్పిపోయింది. పశ్చిమ ఆఫ్రికా తీరంలో ఉన్న కానరీ దీవుల్లో ఈ బోటు మిస్సయినట్లు అధికారులు గుర్తించారు. వారి కోసం స్పానిష్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. దక్షిణ సెనిగల్‌లోని కాఫౌంటైన్ నుంచి బోటు స్టార్ట్ అయినట్లు వాకింగ్ బోర్డర్స్ గ్రూపు పేర్కొన్నది
సెనెగల్ నుండి వలస వచ్చిన బోటు 200 మందితో కానరీ దీవుల నుండి తప్పిపోయింది. పశ్చిమ ఆఫ్రికా తీరంలో ఉన్న కానరీ దీవుల్లో ఈ బోటు మిస్సయినట్లు అధికారులు గుర్తించారు. వారి కోసం స్పానిష్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. దక్షిణ సెనిగల్‌లోని కాఫౌంటైన్ నుంచి బోటు స్టార్ట్ అయినట్లు వాకింగ్ బోర్డర్స్ గ్రూపు పేర్కొన్నది. కానరీ దీవుల నుంచి ఆ నగరం దాదాపు 1700 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ బోటులో అనేక మంది చిన్నారులతో సహా 200 మంది ఉన్నట్లు అధికారులుపేర్కొన్నారు. ఆ బోటు తరహాలోనే మరో రెండు బోట్లు కూడా డజన్ల సంఖ్యలో శరణార్ధుల్ని తీసుకువెళ్తున్నాయి. అయితే ఆ బోట్లు కూడా మిస్సైనట్లు తెలుస్తోంది. మొత్తం 300 మంది ఆచూకీలేకుండా పోయినట్లు స్పెయిన్ రెస్క్యూ అధికారులు చెబుతున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)