Indonesia Volcano Eruption: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం, 22కు పెరిగిన మృతుల సంఖ్య

ఈ ఘటనలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది

Indonesia Volcano Eruption

ఇండోనేషియా (Indonesia)లోని పశ్చిమ ప్రాంతంలో సుమత్రా (Sumatra) దీవిలో మౌంట్‌ మరపి (Mount Merapi)లో ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది.ప్ర మాద సమాచారం అందుకున్న వెంటనే రెస్య్కూ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అగ్ని పర్వతం విస్ఫోటనం (volcano eruption) జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో మొత్తం 75 మంది పర్వతారోహకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో 22 మంది మరణించినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 49 మందికి కాపాడామని తెలిపారు. టన తీవ్రత నేపథ్యంలో మౌంట్‌ మరపి ప్రాంతంలో అధికారులు అలర్ట్‌ ప్రకటించారు. అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వీడియో ఇదిగో, బద్దలైన అగ్నిపర్వతం, 11 మంది సజీవ దహనం, మరో 12 మంది ఆచూకి గల్లంతు

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)