Mumbai 26/11 Terror Attack: ముంబై 26/11 దాడులు, లష్కరే తొయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇజ్రాయెల్
ముంబై మారణహోమానికి కారణమైన లష్కరే తొయిబాను ఉగ్ర సంస్థగా అధికారికంగా ప్రకటించింది.
ముంబైలో 2008వ సంవత్సరంలో 160 మంది అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్న 26/11 దాడులు జరిగి 15 ఏళ్ల కావొస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై మారణహోమానికి కారణమైన లష్కరే తొయిబాను ఉగ్ర సంస్థగా అధికారికంగా ప్రకటించింది.ఈ మేరకు న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరేకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్ర తీరం గుండా ముంబైలో చొరబడి ముంబైలోని 12 కీలక ప్రాంతాల్లో బాంబుల దాడి సాగించారు. ఈ మారణహోమంలో 18 మంది భద్రతా సిబ్బంది, ఒక ఇజ్రాయెల్ పౌరుడి సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ ఒక్కడే ప్రాణాలతో పట్టుబడ్డాడు. నాలుగేళ్ల తర్వాత 2012 నవంబర్ 21న కసబ్‌ను ఉరితీశారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)