Nepal Helicopter Crash: విషాదంగా మారిన నేపాల్‌లో హెలికాప్ట‌ర్ మిస్సింగ్, లామ్జురా పాస్ వ‌ద్ద కొండ‌ల్లో కుప్పకూలిన హెలికాప్టర్, 5 మంది మృతి, మరొకరు మిస్సింగ్

సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్.. 10 నిమిషాల త‌ర్వాత కంట్రోల్ ట‌వ‌ర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఉద‌యం 10:04 గంట‌ల‌కు బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్.. 10 :13 గంట‌ల‌కు అదృశ్య‌మైంది.

Nepal Helicopter Crash. (Photo Credits: Twitter@JagriGDipak)

నేపాల్‌లో హెలికాప్ట‌ర్ అదృశ్య‌మైన ఘ‌ట‌న విషాదంగా మారింది. సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్.. 10 నిమిషాల త‌ర్వాత కంట్రోల్ ట‌వ‌ర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఉద‌యం 10:04 గంట‌ల‌కు బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్.. 10 :13 గంట‌ల‌కు అదృశ్య‌మైంది. దీంతో త్రిభువ‌న్ ఇంట‌ర్నేష‌నల్ ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్ర‌మ‌త్త‌మైంది. అనంత‌రం మ‌రో చాప‌ర్ ద్వారా అదృశ్య‌మైన హెలికాప్ట‌ర్‌ను గాలించ‌గా, లామ్జురా పాస్ వ‌ద్ద కొండ‌ల్లో హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన‌ట్లు గుర్తించారు. దీంతో పైల‌ట్‌తో పాటు ఐదుగురు మెక్సిక‌న్లు ప్రాణాలు కోల్పోయారు. కుప్ప‌కూలిన‌ చాప‌ర్‌ను మ‌నాంగ్ ఎయిర్ హెలికాప్ట‌ర్‌గా అధికారులు నిర్ధారించారు.

Nepal Helicopter Crash. (Photo Credits: Twitter@JagriGDipak)

Here's Updates

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)