Nepal Plane Crash: నేపాల్ ఘోర విమాన ప్రమాదంలో 18 మంది మృతి, తీవ్ర గాయాలతో బయటపడిన పైలట్, టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయిన శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం
రాజధాని నగరం కాఠ్‌మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా.. పైలట్ తీవ్రంగా గాయపడ్డారు
నేపాల్‌లో శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ కూలిపోయింది. రాజధాని నగరం కాఠ్‌మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా.. పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గాయపడిన పైలట్‌ను విమానం నుంచి బయటకు తీసి, ఆసుపత్రికి తరలించారు. రన్‌వేపై నుంచి విమానం కూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీడియో ఇదిగో, టేకాఫ్ సమయంలో కుప్పకూలిన విమానం, ఒక్కసారిగా చెలరేగిన మంటలు, ఫ్లైట్‌లో ఎయిర్‌క్రూతో సహా 19 మంది ప్రయాణికులు
ఖాఠ్మాండు నుంచి పొఖారాకు బయల్దేరిన బాంబార్డియర్ సీఆర్‌జే 200 విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగి విమానం దగ్ధమైంది. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)