Nepal Plane Crash: నేపాల్ విమానం మంటల్లో బూడిదయ్యే సెకన్ల ముందు వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భారతీయ ప్రయాణికుడు తీసిన వీడియో
నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం (Pokhara Airport) సమీపంలో యతి ఎయిర్‌లైన్స్‌కు (Yeti Airlines) చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలి 72 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయిన సంగతి విదితమే.ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విమానంలోని భారతీయ ప్రయాణికుడు ఒకరు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు తీసిన ఈ వీడియోలో విమానం ల్యాండింగ్ దృశ్యాలు కనిపిస్తున్నాయి.రెస్క్యూ పనుల్లో నిమగ్నమైన సిబ్బందికి ఓ మొబైల్ ఫోన్ దొరికింది. అందులో విమాన ప్రమాదానికి ముందు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో విమానంలోని 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది.. మొత్తం 72 మంది ప్రాణాలు కోల్పోయారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)