Niagara Falls Frozen: గడ్డ కట్టుకుపోయిన నయాగారా జలపాతం, మంచు గడ్డలను చూసి ముగ్ధులై పోతున్న పర్యాటకులు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

అమెరికాను మంచు తుపాను(Bomb cyclone) గజగజ వణికిస్తోంది. నయాగరా జలపాతం గడ్డకట్టుకుపోయింది. నయాగరాకు 25 మైళ్ల దూరంలో బఫెలో ఉంటుంది. నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టినా.. ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గట్టకట్టుకుపోయిన నయాగరా జలపాతం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Niagara Falls (Photo-Twitter)

న్యూయార్క్‌ స్టేట్‌ పార్క్‌ ప్రకారం ప్రతి సెకనుకు 3,160 టన్నుల నీరు నయాగారా జలపాతం నుంచి పడుతుంది. ఈ నీరు ప్రతి సెకనుకు 32 అడుగుల వేగంతో ప్రయాణిస్తుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయిన సందర్భాల్లో నయాగరా నదిపై మంచు గడ్డకడుతుందని అధికారులు తెలిపారు. ఇలా మంచుతో ఏర్పడిన బ్రిడ్జ్‌పై నడవటాన్ని నిషేధించారు. 1912, ఫిబ్రవరి 4 నయాగరా నదిపై ఏర్పడిన మంచు వంతెనపైకి వెళ్లి ముగ్గురు చనిపోయిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Here's Tweets

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement