Nobel Prize in Physics 2022: భౌతిక శాస్త్రంలో ముగ్గురుకి నోబెల్ బహుమతి, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌ కొత్త శకానికి పునాది వేసిందని తెలిపిన నోబెల్ నిర్వాహకులు

క్లౌజర్‌, ఆంటోన్‌ జెయిలింగర్‌లకు సంయుక్తంగా ఈసారి ప్రైజ్‌ దక్కింది.

Nobel Prize in Physics 2022

భౌతిక శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ ముగ్గురికి నోబెల్‌ బహుమతిని ప్రకటించారు.భౌతిక శాస్త్ర మేధావులు అలెయిన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌. క్లౌజర్‌, ఆంటోన్‌ జెయిలింగర్‌లకు సంయుక్తంగా ఈసారి ప్రైజ్‌ దక్కింది. చిక్కుబడ్డ ఫోటాన్‌లు, బెల్ అసమానతలను ఉల్లంఘించడం, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌కు మార్గదర్శకత్వం వహించడం లాంటి పరిశోధలకుగానూ ఈ ముగ్గురికి ఈసారి నోబెల్‌ పురస్కారం దక్కింది. వీళ్ల ప్రయోగాత్మక సాధనాల అభివృద్ధి ‘క్వాంటం టెక్నాలజీ’ కొత్త శకానికి పునాది వేసిందని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటన సమయంలో పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)