Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి 286 మందితో భారత్ చేరుకున్న 5వ విమానం, బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను షేర్ చేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఆపరేషన్ అజయ్ లో భాగంగా 286 మందితో అయిదవ విమానం ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకుంది. ఇందులో 18 మంది నేపాలీలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కూడా షేర్ చేశారు.

Flight (Representative image)

ఆపరేషన్ అజయ్ లో భాగంగా 286 మందితో అయిదవ విమానం ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకుంది. ఇందులో 18 మంది నేపాలీలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కూడా షేర్ చేశారు.

ఇజ్రాయెల్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి A340 విమానం ఆదివారం టెల్‌ అవీవ్ నగరానికి చేరుకోగానే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని జోర్డాన్‌కు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. సోమవారం రావాల్సిన విమానం మంగళవారం 286 మందితో ఢిల్లీ చేరుకుంది. ఇందులో 22 మంది కేరళవాసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే నాలుగు విమానాల్లో 900 మందిని భారత్‌కు తరలించారు.

Here's Update News

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement